mygajwel

one stop For any stuff..

  8 00 88 77 062   

View Details

  • Blog Title

    ఫాస్టాగ్‌ విషయంలో కేంద్రం మరో నిర్ణయం

    దిల్లీ: ఫాస్టాగ్‌ విషయంలో కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. వాహనదారులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 25 శాతం ఫాస్టాగ్‌ లేన్స్‌ను తాత్కాలికంగా హైబ్రిడ్‌ లేన్స్‌గా మారుస్తున్నట్లు ప్రకటించింది. ఈ లేన్లలో అటు ఫాస్టాగ్‌తో పాటు నగదు చెల్లింపులనూ అనుమతిస్తారు. అయితే నెలరోజుల పాటు మాత్రమే ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. జాతీయ రహదారులపై అన్ని టోల్‌ప్లాజాల వద్ద డిసెంబర్‌ 1 నుంచి ఫాస్టాగ్‌ తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్రం తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ గడువును డిసెంబర్‌ 15కు పొడిగించారు. నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) నుంచి వచ్చిన అభ్యర్థనల నేపథ్యంలో వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ వెసులుబాటు కల్పించింది. మిగిలిన 75 శాతం లేన్లు మాత్రం ఫాస్టాగ్‌ లేన్లుగానే ఉంటాయని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. ఫాస్టాగ్‌కు సంబంధించిన ఎలాంటి సహాయం కోసమైనా 1033కి ఫోన్‌ చేయాలని సూచించింది.