mygajwel

one stop For any stuff..

  8 00 88 77 062   

View Details

  • Blog Title

    ‘దొంగ’ కథ ఎమోషనల్‌గా ఉంటుంది: కార్తి

    హైదరాబాద్‌: ‘దొంగ’ సినిమా కథ విన్నప్పుడు భావోద్వేగంగా అనిపించిందని కథానాయకుడు కార్తి పేర్కొన్నారు. ఆయన| జ్యోతిక కలిసి నటించిన సినిమా ‘తంబి’. ఈ సినిమా తెలుగులో ‘దొంగ’ టైటిల్‌తో డిసెంబరు 20న విడుదల కాబోతోంది. జీతూ జోసెఫ్‌ దర్శకుడు. ఇందులో కార్తి తమ్ముడిగా| జ్యోతిక అక్కగా నటించారు. ఆదివారం ఈ సినిమా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తి మాట్లాడుతూ.. ‘‘దొంగ’ కథ వినేటప్పుడు అక్క- తమ్ముడు మధ్య బంధం చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ‘ఊపిరి’లో లాగానే ఈ సినిమాలో కూడా అందమైన మొమెంట్స్ ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాని ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటారు. ‘దొంగ’ మీకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం నాకుంది. ‘నా పేరు శివ’| ‘ఊపిరి’ కలిసిన సినిమాలా ఇది ఉంటుంది. అందరి హృదయాల్ని తాకుతుంది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. కుటుంబంతో కలిసి థియేటర్‌లో ‘దొంగ’ సినిమాను ఎంజాయ్‌ చేయండి’ అని అన్నారు.